BALANTRAPUVARI BLOG

BALANTRAPUVARI BLOG
NISHKALMASHAMAINA BHAKTIYE MOKSHASADHANAMU

Saturday 5 May, 2012

ANNAMAYYA SAMKIRTANALU--LAKSHMINARASIMHA



BKP

నరులాలనేడువో నారసింహజయంతి
సురలకు ఆనందమై శుభములొసగెను


సంధించి వైశాఖశుధ్ధచతుర్దశి శనివార-
మందు సంధ్యాకాలమున నౌభళేశుడు
పొందుగా గంభములోన బొడమి గడపమీద
కందువ గోళ్ళ జించె గనకకశిపుని


నరమృగరూపము నానాహస్తముల
అరిది శంఖచక్రాది ఆయుధాలతో
గరిమ ప్రహ్లాదుని గాచిరక్షంచి నిలిచె
గురుతరబ్రహ్మాండగుహలోనను


కాంచనపు గద్దెమీద గక్కన గొలువైయుండి
మించిగ నిందిర దొడమీదబెట్టుక
అంచె శ్రీవేంకటగిరి నాదిమపురుషుండై
వంచనసేయక మంచివరాలిచ్చీనదివో

narulAlanEDuvO nArasiMhajayamti
suralaku AnaMdamai Subhamulosagenu


saMdhimci vaiSAkhaSudhdhacaturdaSi SanivAra-
maMdu saMdhyAkAlamuna noubhaLESuDu
poMdugA gambhamulOna boDami gaDapamIda
kaMduva gOLLa jiMce ganakakaSipuni


naramRgarUpamu nAnAhastamula
aridi SaMkhacakrAdi AyudhAlatO
garima prahlAduni gAcirakShmci nilice
gurutarabrahmAMDaguhalOnanu


kAMcanapu gaddemIda gakkana goluvaiyuMDi
miMciga niMdira doDamIdabeTTuka
aMce SrIvEMkaTagiri nAdimapuruShuMDai
vaMcanasEyaka maMcivarAliccInadivO


ANNAMAYYA LYRICS BOOK NO--4
SAMKIRTANA--310
RAGAM MENTIONED--MUKHARI





నేడు నారసింహ జయంతి..
అందరికీ శుభాకాంక్షలు..


బాలాంత్రపు వేంకట శేష రమాకుమారి
balantrapuvariblog.blogspot.com
09337100346







No comments:

Post a Comment